అంశం 18 బాక్టీరియాలలోను, వైరస్ లలో కూడా డీ. ఎన్. ఏ. ఉంటుంది .
మైక్రోస్కోప్ లు ఏకకణ జీవులైన బాక్టీరియాల ఉన్కిని తెలిపాయి. అయితే బాక్టీరియాల లోను జీన్ లు ఉంటాయా, ఉంటే మరింత ఉన్నత జాతి జీవాలలోని జన్యువు లకి ఈ ప్రాథమిక జాతి జీవాలలోని జన్యువు లకి మధ్య సంబంధం ఏంటి? మొదలైన ప్రశ్నల విషయంలో వివాదం ఉండేది. 1940 లలో బాక్టీరియాలలో కూడా లైంగిక కలయిక ఉంటుందని, అలాంటి కలయిక వల్ల రెండు బాక్టీరియాల మధ్య జన్యువు ల వినియమం జరుగుతుందని తెలిసింది.
బాక్టీరియల్ వైరస్ ల విషయంలో కూడా అదే జరుగుతుంది. వైరస్ 'ఆతిథేయ' (host) బాక్టీరియా కి అతుక్కుని, దాని జీన్ లని ఓ నాళం లాంటి తోక ద్వార బాక్టీరియాలోకి ఎక్కిస్తుంది. వైరస్ సోకిన (infect అయిన) బాక్టీరియా కణంలో కొత్త వైరస్ లు పునరుత్పత్తి చెందడానికి కారణం అందులోని జీన్ లే నని 1952 లో ఆల్ఫ్రెడ్ హెర్షే (Alfred Hershey) నిరూపించాడు. ఈ ప్రయోగాలు లోగడ జీన్ లు డీ. ఎన్. ఏ. చేత తయారుచెయ్యబడతాయని సూచించిన ఆవెరీ ప్రయోగాలకి గట్టి మద్దతు నిచ్చాయి. అంతేకాకా విశ్వజనీనమైన జన్యుశాస్త్ర సూత్రాలని నిర్ధారించడానికి బాక్టీరియాలని, వైరస్ లని కూడా నమూనాలుగా వాడవచ్చు నని నిరూపించబడింది.