అంశం 4కొన్ని జన్యువులు బహిర్గత జన్యువులు.
మార్పుకి లోను గాని, అవిభాజ్యమైన పరమాణువుల వంటివి జన్యువులు అని మెండెల్ నమ్మాడు.
జన్యువులు వివిధ రీతుల్లో కలిసినప్పటికి వాటి ప్రత్యేక లక్షణాలని అవి కోల్పోవు. ఉదాహరణకు, వేరు వేరు గింజ రంగులు (ఆకుపచ్చ మరియు పసుపు) కలిగిన రెండు స్వచ్చమైన జాతులకి చెందిన తల్లిదండ్రుల మధ్య సంకరణ చేసినప్పుడు, వాటి మిశ్రమ సంతానం ఆకుపచ్చ మరియు పసుపు గింజ రంగు జన్యువులని కలిగివుండాలి. కాని వాటి మిశ్రమ సంతానం పసుపు రంగు గింజ ను మాత్రమే కలిగి ఉంటాయి. ఆకుపచ్చ రంగు జన్యు ప్రత్యామ్నాయం మీద పసుపు రంగు జన్యు ప్రత్యామ్నాయం యొక్క ప్రాబల్యమే అందుకు కారణం అని మెండెల్ ప్రతిపాదించాడు. అలా ఒక జన్యువు కన్నా మరో జన్యువు ప్రబలమైనప్పుడు ప్రబల జన్యువు యొక్క లక్షణమే బహిర్గతం అవుతుంది. అందుకే అలాంటి జన్యువుని బహిర్గత జన్యువు (dominant gene) అంటారు. ఒక లక్షణానికి చెందిన జన్యువుల జతలో ఒక బహిర్గత జన్యువు ఉన్నా, దానికి సంబంధించిన లక్షణమే బహిర్గతం అవుతుంది. సంకర జాతి మొక్కల మధ్య సంకరణ చేసినప్పుడు మాత్రం ఆకుపచ్చ రంగు గింజలు తరువాత తరంలో కనిపిస్తాయి. అంటే అంతవరకు ‘అంతర్గతం’గా ఉండిపోయిన, ఆకుపచ్చ రంగు అనే లక్షణానికి సంబంధించిన జన్యువు ఏదో ఉందన్నమాట. అలాంటి జన్యువుని ‘అంతర్గత’ (recessive) జన్యువు అన్నాడు మెండెల్. కనుక అంతర్గత జన్యువు ప్రతి యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు మాత్రమే అంతర్గతంగా ఉండే ఆకుపచ్చ గింజ రంగు లక్షణం కనిపిస్తుందని మెండెల్ ప్రతిపాదించాడు.