అంశం 14మానవుల ఆరోగ్యం మరియు ప్రవర్తనని మెండెల్ జన్యుశాస్త్రం సరిగా వివరించలేకపోయింది.
మెండెల్ నియమాలని వ్యవసాయానికి వర్తింపచేయడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. మెండెల్ ఆలోచనలు సుజన్యు వాదానికి (eugenics) బాటలు వేశాయి. మంచి జన్యువులు గల తల్లిదండ్రుల మధ్య సంపర్కం చేత సత్ సంతానం కలిగేలా చేసి, ఆ విధంగా మానవ జాతిని మెరుగుపరచాలన్నది ఈ యూజెనిక్స్ ఉద్యమం లోని ముఖ్యోద్దేశం. జన్యుదోషాలు కలిగిన వ్యక్తుల మధ్య వివాహాలని నిరుత్సాహపరిచిందీ ఉద్యమం.
మానవ ప్రవర్తనలో సంక్లిష్టమైన అంశాలని, మరియు మానసిక అనారోగ్యం వంటి పరిణామాలని వివరించడం కోసం సాధారణమైన బహిర్గత/అంతర్గత పథకాలని సుజన్యు వాదులు (Eugenicists) తప్పుగా ఉపయోగించారు. ఇలాంటి సంక్లిష్ట సమస్యలకి ఏదో ఏకైక జన్యువు కాకుండా, పలు జన్యువులు కారణం అవుతాయని మనకి ఇప్పుడు తెలుసు. మానవ వికాసం మీద పరిసరాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కూడా వీళ్లు విఫలమయ్యారు. అమెరికా లోని యుజెనెక్స్ చట్టం, జన్యు వాస్తవాల కంటే రాజకీయ మరియు సామాజిక పక్షపాతాలని ప్రతిబింబిస్తుంది. అమిశ్రితమైన ఆర్యజాతిని సాధించడం కోసం నాజీలు తలపెట్టిన రక్తతర్పణం మొదలైన దారుణ ఉదాహరణల వల్ల సజన్యు వాదం అప్రతిష్ట పాలయ్యింది.