అంశం 7ప్రతి కణం తన ముందు తరం కణాలనుంచి ఆవిర్భవిస్తుంది.

All cells arise from pre-existing cells.

శతాబ్దాలుగా మనుషులు  నిర్జీవమైన పదార్థం నుంచి "యాద్రుచ్ఛిక ఉత్పత్తి" (Spontaneous generation) ద్వారా జీవం పుట్టిందని నమ్ముతూ వచ్చారు. ఈ దీర్ఘకాలిక అపోహ చివరికి 1880ల లో పటాపంచలు అయ్యి,ప్రతీ జీవి తన ముందుతరం  జీవరాసులనుంచి పునరుత్పత్తి (Reproduction) అనే ప్రక్రియ ద్వారా ఆవిర్భవిస్తుందన్న విషయం స్పష్టమైంది. కణాలు జీవపదార్థంలో ప్రాథమిక భాగాలే అయితే, తమలో  క్రొమోజోములని ఒక కచ్చితమైన సంఖ్యలో నిలుపుకోడానికి ఒక నిర్దిష్టమైన పునరుత్పత్తి వ్యవస్తను కలిగి ఉండాలి.

మెండెల్ పరిశోధనలు ప్రచురించబడిన సుమారు ఒక దశాబ్దం తరువాత, రంగుల సహాయంతో శాస్త్రవేత్తలు క్రొమోజోములను కనిపించేలా చేసి తద్వారా కణ విభజన (సమ జీవకణ విభజన/Mitosis) సమయం లో వాటి ప్రవర్తనను పరిశీలించారు. మొదటగా, ప్రతీ క్రొమోజోమూ తన కాపీలను సృష్టించుకుంటుంది. తరువాత ఆ కాపీలు కణమధ్యరేఖ (Equator of the cell) వద్ద వరుసగా అమర్చబడతాయి. ఆ తరువాత అవి ఎదురెదురుగా ఉన్న కణధ్రువాలకు లాగబడతాయి. చివరగా ఆ కణం తన కణమధ్యరేఖ వద్ద విభజించబడి అచ్చంగా తనలాగే, తనవద్ద ఉన్నన్ని క్రోమోజోములే కలిగిన రెండు కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.