అంశం 3

జన్యువుల మధ్య మిశ్రమాలు ఉండవు.

Genes don't blend.

సామాన్యంగా కింది తరంలో పై తరం యొక్క లక్షణాల మిశ్రమం కనిపిస్తుంది. కాని మెండెల్ కి తాను పరీక్షించిన బఠానీ మొక్కల లక్షణాలలో అలాంటి మిశ్రమం కనిపించలేదు. శుద్ధ జాతి మొక్కల మధ్య సంకరం జరిపినప్పుడు తదుపరి తరం మొక్కల్లో లక్షణాల మిశ్రమం కనిపించలేదు. ఉదాహరణకి ఆకుపచ్చ బఠానీలు గల శుద్ధజాతి మొక్కలకి, పసుపు పచ్చ బఠానీలు గల శుద్ధ జాతి మొక్కలకి మధ్య సంకరం జరిపినప్పుడు, తదుపరి తరం మొక్కల్లో పసుపు-ఆకుపచ్చ కలిసిన మధ్యస్థ వర్ణం వున్న బఠానీలు కనిపించాలి. ఎందుకంటే పసుపు, ఆకుపచ్చ రంగు పెయింట్లు కలిపితే మరి అదే జరుగుతుంది కదా? కాని అలా జరగలేదు. తదుపరి తరంలో కేవలం పసుపు పచ్చ బఠానీలు గల మొక్కలే మెండెల్ కి కనిపించాయి. మధ్యస్థంగా ఉండే రంగులు కనిపించలేదు. అసలు ఆకుపచ్చ బఠానీ మొక్కలు కూడా కనిపించలేదు.