అంశం 6జన్యువులు నిజమైన వస్తువులు.
మెండెల్ తన పరిశొధనా సారాంశాన్ని “Experiments in plant hybridization" (మొక్కలపై సంకరణ ప్రయోగాలు) అనే పేరు తో ప్రచురించి ఆ ప్రతులను వివిధ దేశాలకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు పంపాడు. అయితే జన్యువుల పట్ల అతని ప్రగాఢ భావాలు, జీవరాసులను పైపైన చూసి, పరిశీలించి వర్గీకరణ చెయటానికే అలవాటు పడ్డ తన సమకాలీనులైన చాలామంది ప్రకృతివేత్తలు (Naturalists) హర్షించలేదు. అందువల్ల 1900 లో యురోప్ కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు వేరు వేరుగా నిర్థారించేవరకు మెండెల్ కృషి నిరుపయోగంగా పడి ఉంది.
ఆ సమయానికి "జీవానికి కణాలు ప్రాధమిక యూనిట్లు (basic units)" అనడానికి బలమైన ఋజువు ఉంది. కణాలలో గల వివిధ నిర్మాణాలకి సంబంధించిన పరిజ్ఞానం కుడా అప్పటికి బాగానే ఉంది (ఉదా: క్రొమోజోముల యొక్క దారము వంటి నిర్మాణము అప్పటికే తెలుసు). వివిధ జీవరాశులు వేరు వేరు మొత్తాలలో క్రొమోజోములను కలిగి ఉంటాయని, అందువల్ల ఆ జన్యువులు వేరు వేరు జీవరాశులలో నిర్ధిష్టమైన సమాచారాన్ని కలిగి ఉంటాయనటానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కణాలు మరియు క్రొమోజోముల ప్రవర్తనకి సంబంధించిన ఈ పరిశీలన మెండెల్ యొక్క ప్రగాఢ భావానికి, నిర్దిష్టమైన ఆధారాన్ని అందించింది.