అంశం 5జన్యువుల వారసత్వం కొన్ని నియమాలకి లోబడి ఉంటుంది.
ప్రతి లక్షణానికి అందుకు సంబంధించిన ఒక జన్యువుల జత ఉంటుందని మెండెల్ ప్రతిపాదించినప్పుడు, ఓ జటిలమైన సమస్య తలెత్తింది. తల్లిదండ్రులు చెరొక జన్యు జతని (మొత్తం రెండు జన్యు ప్రతులు) ఇవ్వడం వలన సంతానంలో ప్రతి విశిష్ట లక్షణం కోసం నాలుగు జన్యువులు (రెండు జన్యు జతలు) ఉండాలి. కాని నిజానికి రెండే ప్రతులు ఉంటాయి కనుక, మరి ఈ నాలుగు రెండుగా ఎలా మారాయి? ఈ సమస్యకి మెండెల్ ఇలా పరిష్కారం సూచించాడు. లింగ కణాలైన (germ cells) శుక్ర కణం మరియు అండం మాత్రం ఒక్కొక్క జన్యువుని మాత్రమే కలిగివుంటాయి. అండం ద్వార తల్లి నుండి అర్థ జన్యు సముదాయం, శుక్ర కణం ద్వార తండ్రి నుండి అర్థ జన్యు సముదాయం సంక్రమించడం వల్ల, సంతానం లో సంపూర్ణ జన్యు సముదాయం ఏర్పడుతోంది.
తల్లిదండ్రుల మధ్య జన్యువుల సంకరం జరిగినప్పుడు, బహిర్గత- అంతర్గత జన్యువుల మధ్య ప్రత్యేక నిష్పత్తులు ఏర్పడతాయని మెండెల్ గుర్తించాడు. ఉదాహరణకి, రెండు సంకరజాతి పసుపు గింజల మధ్య సంకరణ చేసినప్పుడు ఆకుపచ్చ విత్తనాల కన్నా పసుపు గింజలు మూడు రెట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఇదే మెండెల్ యొక్క ప్రసిద్ధ 3:1 నిష్పత్తి సూత్రం.