అంశం 8లింగ కణాలకి (germ cells) సంబంధించి ఒకే క్రోమోసోమ్ ల సముదాయం ఉంటుంది. శారీరక కణాలకి (somatic cells) సంబంధించి క్రోమోసోమ్ ల జతలు ఉంటాయి.

Sex cells have one set of chromosomes; body cells have two.

లైంగిక ప్రత్యుత్పత్తిలో (sexual reproduction) ప్రత్యేక లింగ కణాల కలయిక వల్ల సంతతి పుడుతుంది. ఆ లింగ కణాలే స్త్రీ నుండి వచ్చే అండం, పురుషుడి నుండి వచ్చే శుక్రం. మెండెల్ కృషిని పునరావిష్కరించడానికి కొంచెం ముందు, లింగ కణాల పుట్టుక (meiosis) లో క్రోమోసోమ్ ల ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయం మీద కొన్ని నిశితమైన అధ్యయనాలు జరిగాయి. ముందుగా సమజాతీయ (homologous) క్రోమోసోమ్ లు  కణం యొక్క కణమధ్యరేఖ వద్ద జతలుగా పోగవుతాయి. ఆ దశలోనే వాటి మధ్య జన్యు సమాచారం యొక్క వినియమం జరుగుతుంది. ఆ తరువాత ప్రతీ జత  నుండి ఒక క్రోమోసోమ్ కణం యొక్క చెరొక ధృవం వద్దకి లాగబడుతుంది. ఈ రకమైన తరుగుదల విభజన (reduction division) వల్ల   ప్రతీ పుత్రకణానికి  క్రోమోసోమ్ ల జత నుండి కేవలం ఒక సమజాతీయ క్రోమోసోమ్ మాత్రమే సంక్రమించడం వల్ల, ఆ పుత్రకణానికి ఒక్క సమజాతీయ క్రోమోసోమ్ ల సముదాయం మాత్రమే ప్రాప్తమవుతుంది.

ఆ విధంగా క్రోమోసోమ్ ల సముదాయం సగం అవుతుంది. దాని వల్ల సమజాతీయ క్రోమోసోమ్ లు యాదృచ్ఛికంగా లింగ కణాలలో పంపకం అవుతాయి. శుక్రం, అండం ఒక్కటైనప్పుడు పూర్తి క్రోమోసోమ్ ల సంఖ్య తిరిగి సాధించబడుతుంది. మూడు దశాబ్దాల ముందు మెండెల్ ఊహించిన జన్యువుల ప్రవర్తనే ఇక్కడ కుడా కచ్చితంగా ప్రస్ఫుటం అవుతోంది.