అంశం 10క్రోమోజోములు జన్యువులను కలిగి ఉంటాయి.

Chromosomes carry genes.

కొలంబియా విశ్వ విద్యాలయంలో థామస్ హంట్ మార్గన్ అనే శాస్త్రవేత్త మరియు అతని విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి పిల్లలకు లక్షణాలు సంక్రమించాడనికి గల భౌతిక కారణాలను కనుగొనడం ద్వారా జన్యు శాస్త్రంలో ఒక నూతన శకానికి తెర తీశారు. మెండెల్ చిక్కుడు మొక్కలో పరిశోధించినట్టే వీళ్ళు ఈగల్లో పరిశోధనలు జరిపారు. అయితే మెండెల్ లా కేవలం విస్తృతంగా కనిపించే లక్షణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు కొంచం భిన్నమైన లక్షణాలు ఉన్న ఈగల కోసం వెదికారు.

అలా కొన్ని నెలల పాటు శ్రమించిన తరువాత వీళ్ళకి తెల్లని కళ్ళు కలిగిన మగ ఈగ ఒకటి దొరికింది. సాధారణంగా ఈ ఈగలకి ఎరుపు రంగు కళ్లు  ఉంటాయి. ఈ తెలుపు కళ్ళున్న మగ ఈగతో ఎర్ర కళ్ళున్న ఆడ ఈగను సంపర్కం చేయించడం ద్వారా పుట్టిన ఈగలలో ఎరుపు కళ్లే ఉన్నాయి. ఆ తరువాతి తరంలో మళ్లీ తెలుపు కళ్ళున్న ఈగలు పుట్టాయి కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇటువంటి అరుదైన లక్షణాలను "అంతర్గత" (Recessive) లక్షణాలంటారు. ఐతే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎరుపు రంగు కళ్ళు కేవలం మగ ఈగల్లో మాత్రమే ఉంటాయి ఆడ ఈగల్లో ఉండవు. దీనివలన ఈగల్లో కళ్ళ ఎరుపు రంగు అనే లక్షణాన్ని నిర్దేశించే జన్యువు భౌతికంగా "X" క్రోమోజోము మీద ఉంటుందని అర్ధమయింది.