అంశం 2జన్యువులు జతలుగా వస్తాయి.

Genes come in pairs.

మెండల్ బఠాణి మొక్క మొత్తాన్ని పరిగణ లోనికి తీసుకొవటానికి బదులు 7 ప్రత్యేక లక్షణాలను మాత్రం ఎంచుకున్నాడు. ప్రతి లక్షణానికి రెండు వైకల్పిక రూపాలు ఉంటాయని గమనించాడు. ఉదాహరణకి, బఠాణి గింజ ఆకుపచ్చ లెదా పసుపు రంగులో ఉంటుంది. మెండల్ వివిధ సంకరణల ఫలితాలను విశ్లేషించిన తరువాత "ఒక లక్షణం యొక్క ప్రతి వైకల్పిక రూపము దానికి సంబంధించిన ఒక జన్యువు యొక్క వైకల్పిక రూపము చేత నిర్దేశింప బడుతుంది" అన్న నిర్ధారణకి వచ్చాడు.తల్లిదండ్రులనుంచి పిల్లలకు జన్యు సంక్రమణ గురించి తెలుసుకొవటానికి ముందు అసలు తల్లిదండ్రుల్లో ఎలాంటి జన్యువులు ఉన్నవో తెలుసుకోవటం ముఖ్యమని గ్రహించాడు. బఠాణి మొక్కలు సహజంగా స్వసంపర్క (Self-fertilizers) మొక్కలు కావటం వలన వాటిలో "శుద్ధ జాతి" రకాలు (pure-bred strains) సులభంగా అందుబాటులో ఉండేవి. అందులో ప్రతీ జాతి ఒక లక్షణాన్ని నిర్దేశించే కేవలం ఒకే ఒక్క జన్యు రూపాన్ని కలిగి ఉండేది. పసుపు రంగు గింజలు కలిగిన "శుద్ధ జాతి" మొక్కలు పసుపు రంగు గింజలు కల సంతానాన్ని మాత్రమే ఉత్పత్తి చేశాయి.అలాగే పచ్చ రంగు గింజలు కలిగిన "శుద్ధ జాతి" మొక్కలు కేవలం ఆకుపచ్చ రంగు గింజలు కల సంతానాన్ని మాత్రమే ఉత్పత్తి చేశాయి. ఈ పరిశోధనల బట్టి శుద్ధ జాతి మొక్కల్లో ఒకే లక్షణానికి సంబంధించిన జన్యువు యొక్క రెండు కాపీలు ఉండోచ్చని మెండెల్ నిర్ధారించాడు.