అంశం 24 ఆర్. ఎన్. ఏ. సందేశం కొన్ని సార్లు సవరించబడుతుంది.

The RNA message is sometimes edited.

డీ.ఎన్. ఏ. నుండి అనులేఖించబడ్డ ఆర్.ఎన్. ఏ. కోడ్, డీ.ఎన్. ఏ. కి నిర్దుష్టమైన ప్రతిరూపం అయ్యుండాలని సిద్ధాంతపరంగా మొదట్లో నమ్మడం జరిగింది. డీ.ఎన్. ఏ. కి ఆర్.ఎన్. ఏ.కి మధ్య కచ్చితమైన పరస్పరత ఉంటుందన్న విషయం బాక్టీరియా కణాల (procaryotes) మీద చేసిన ఎన్నో ప్రయోగాలలో నిర్ధారించబడింది. అయితే రీకాంబినంట్ డీ.ఎన్. ఏ. పద్ధతులతో ఉన్నత కణాల(eucaryotes) జన్యువు లని పరిశీలించినప్పుడు కొన్ని అంతర్వైరుధ్యాలు తలెత్తాయి.

మరో విషయం ఏంటంటే అనులిఖితమైన ఎం. ఆర్.ఎన్. ఏ. (mRNA transcript) యొక్క పొడవు మూలంలో ఉన్న జన్యువు కన్నా చిన్నది కావడం విశేషం. ఎం. ఆర్.ఎన్. ఏ. తత్సంబంధమైన డీ.ఎన్. ఏ. నమూనాతో కలిసి వున్నప్పుడు తీసిన ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ లలో ఈ తేడా చాలా స్పష్టంగా కనిపించింది. ఎం. ఆర్.ఎన్. ఏ. తో కలవని భాగాలలో డీ.ఎన్. ఏ. చుట్లు (loop) చుట్టుకుని ఉండడం కనిపించింది. డీ.ఎన్. ఏ. లో ప్రోటీన్లని నిర్దేశించే సమాచారానికి (protein-coding information) మధ్య మధ్యలో ప్రోటీన్లతో సంబంధం లేని (non-coding) భాగాలు కనిపించాయి. అందుకే జన్యువు లోని సమాచారం న్యూక్లియోటైడ్ ల అవిచ్ఛిన్న క్రమం అన్నట్టు ఉండదు. జన్యు సమాచారం ఈ విధంగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది కనుక జీన్లని "విభజిత జీన్లు" (split genes) అంటారు. డీ.ఎన్. ఏ. లోని సందేశం మొత్తం ఒక తాత్కాలికమైన ఆర్.ఎన్. ఏ. (pre-mRNA) ప్రతిరూపంలోకి అనులేఖించబడుతుంది. కాని కేంద్రకంలోని ఎమ్. ఆర్.ఎన్. ఏ. కోడ్ అక్కడే సవరించబడడం వల్ల మరింత పరిపక్వమైన mRNA రూపొందించబడుతుంది. డీ.ఎన్. ఏ. లో ప్రోటీన్ ల వ్యక్తీకరణకి సంబంధించిన భాగాన్ని exons అంటారు. ప్రోటీన్ లని వ్యక్తీకరణతో సంబంధం లేని ప్రాంతాలని introns అంటారు. ఇన్ట్రాన్ లని తొలగించి, ఇక మిగిలిన ఎక్సాన్ లని వరుసగా పక్కపక్కగా చేర్చే ప్రక్రియనే డీ.ఎన్. ఏ. splicing అంటారు.